ఛత్రపతి శివాజీ విగ్రహ ప్రతిష్టాపనలో ఉద్రిక్తత
బతుకమ్మ,ఏర్గట్ల: ఏర్గట్ల మండల కేంద్రంలో యువజన సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహం బస్టాండ్ ఎక్స్ రోడ్డు వద్ద చత్రపతి శివాజీ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. శివాజీ విగ్రహ ప్రతిష్టాపనకు ప్రభుత్వం నుండి ఎలాంటి పర్మిషన్ లేదంటూ స్థానిక పోలీసులు జోక్యం చేసుకుని ప్రతిష్టించిన శివాజీ విగ్రహం తొలగిస్తామంటూ చెప్పడంతో బస్టాండ్ పరిసరాల్లో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. నూతనంగా ఏర్పాటు చేసే శివాజీ విగ్రహం విషయంపై పోలీసులకు యువజన సంఘాల సభ్యులకు, హనుమాన్ దీక్ష స్వాములు జైశ్రీరామ్, చత్రపతి శివాజీ మహారాజ్...