బతుకమ్మ,ఏర్గట్ల: ఏర్గట్ల మండల కేంద్రంలో యువజన సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహం బస్టాండ్ ఎక్స్ రోడ్డు వద్ద చత్రపతి శివాజీ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. శివాజీ విగ్రహ ప్రతిష్టాపనకు ప్రభుత్వం నుండి ఎలాంటి పర్మిషన్ లేదంటూ స్థానిక పోలీసులు జోక్యం చేసుకుని ప్రతిష్టించిన శివాజీ విగ్రహం తొలగిస్తామంటూ చెప్పడంతో బస్టాండ్ పరిసరాల్లో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. నూతనంగా ఏర్పాటు చేసే శివాజీ విగ్రహం విషయంపై పోలీసులకు యువజన సంఘాల సభ్యులకు, హనుమాన్ దీక్ష స్వాములు జైశ్రీరామ్, చత్రపతి శివాజీ మహారాజ్ కు జై జై అనే నినాదాలతో బస్టాండ్ ప్రాంతం దద్దరిల్లింది. ఈ విషయంపై తీవ్ర ఉద్రిక్తత కు దారితీసింది. దాదాపు నాలుగు గంటల పాటు చత్రపతి శివాజీ మహారాజ్ నూతనంగా నిర్మించే విగ్రహం వద్ద పరిస్థితి ఉధృతంగా మారడంతో యువజన సంఘాల సభ్యులు, విగ్రహం నిర్మించే స్థలం వద్ద సిమెంటు కాంక్రీటు పోయడానికి ప్రయత్నించడంతో పరిస్థితి చేయిదాటడoతో భీంగల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆర్మూర్ఏసీపీలు అదనపు బలగాలతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. పరిస్థితి అదుపులోకి తీసుకురావడానికి గ్రామ పెద్ద మనుషులు, అన్ని రాజకీయ పార్టీల ప్రముఖ నాయకులతో, యువజన సంఘాల నాయకులతో చర్చలు జరిపి పరిస్థితిని అదుపులోకి తెచ్చి విగ్రహాన్ని యధాతధంగా ఉంచడంతోపాటు నూతనంగా నిర్మించే శివాజీ విగ్రహానికి ప్రభుత్వ అధికారులచే పర్మిషన్ తెచ్చి ప్రారంభోత్సవం చేసే వరకు విగ్రహానికి ముసుగు వేసి ఉంచాలని పోలీసులు తెల్పడంతో ఈ యొక్క వివాదం సద్దుమనిగింది. ఏర్గట్ల లో నూతనంగా నిర్మించే శివాజీ విగ్రహం విషయం పై శాంతియుతంగా పరిష్కారం జరగడంతో ఇటు ప్రజలు అటు పోలీసు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
