Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 July 2025, 9:36 pm Posted by : ramakrishna

ఆక్రమణల తొలగింపు ఉద్రిక్తం

  • పొలీసుల విధులకు అటంకం.. తొలగించకుండా అడ్డంకులు
  • పలువురిపై రెండవ టౌన్ పోలీస్ స్టేషన్ లో అధికారుల ఫిర్యాదు

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలో ట్రాఫిక్ పోలీసులు రోడ్డు ఆక్రమించి జరుగుతున్న వ్యాపారాలపై కన్నెర్ర చేశారు. స్థానిక కుమార్ గల్లీలో శుక్రవారం మధ్యాహ్నం ఆక్రమణలు తొలగించారు. సాయంత్రం స్థానిక అహ్మది బజార్ ప్రాంతంలో ఆక్రమణలు తొలగింపు సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది.  ప్రధానంగా అహ్మది బజార్ ప్రాంతంలో వాహనాలు వెల్లకుండా షాపుల వరకు కాకుండా రోడ్డును ఆక్రమించి ఏర్పాటు చేసిన షెడ్డులు, రేకులను తొలగించేందుకు అధికారులు సూచనలు చేశారు. ఈ విషయం స్థానికుల ద్వారా తెలుసుకున్న మజ్లీస్, కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు అక్కడి వచ్చారు. నగరంలోని  అన్ని ప్రాంతాలలో ఉన్న ఆక్రమణలు

Tension over eviction

తొలగించకుండా ఏకంగా పేదలు, చిరు వ్యాపారాలు చేసుకునే చోట ఆక్రమణలు ఎలా తొలగిస్తారని నేతలు ట్రాఫిక్ ఎసిపి మస్తాన్ అలీ, రెండవ టౌన్ ఎస్ఐ ముజాహిద్ లతో వాదనకు దిగారు. అక్కడ ప్రజలు పెద్ద ఎత్తున గుమి గూడి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దానితో అక్కడ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్, పోలీస్ ల విధులను అడ్డుకున్నారు. ఈ విషయంను ట్రాఫిక్ ఎసిపి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దానితో నిజామాబాద్ ఎసిపి రాజా వేంకట్ రెడ్డి అదనపు బలగాలను రప్పించి గుంపును చెదరగొట్టారు. ఈ సంధర్బంగా పోలీస్ అధికారుల విధులకు అటంకం కలిగించిన నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకోని స్టేషన్ కు తరలించారు. తమ విధులకు ఆటంకం కలిగించిన వారిపై చర్యలు తీసుకోవాలని రెండవ టౌన్ పోలిస్ స్టేషన్ లో లిఖిత పూర్వకంగా పిర్యాదు చేశారు. అధికారుల సూచనల మేరకు పలువురిపై కేసులు నమోదు చేసే యోచనలో ఉన్నట్లు తెలిసింది.

Tension over eviction