Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 December 2024, 10:55 am Posted by : ramakrishna

వీరన్నగుట్ట తాండాలో ఉద్రిక్తత

. . . బాలికపట్ల వ్యక్తి అసభ్య ప్రవర్తన

. . . తాండావాసులో దాడిలో గాయపడి మృతి

. . . పోలిసులు పికేటింగ్ ఎర్పాటు

 రెంజల్, బతుకమ్మ:

రెంజల్ మండలం వీరన్నగుట్ట తాండాలో గురువారం రాత్రి నుంచి ఉద్రిక్తత పరిస్థితులు నెలకోన్నాయి. తాండాలో కిరాణ దుకాణం నిర్వహించె రెడ్యా నాయక్ గురువారం సాయంత్రం  మైనర్ బాలికను వేదించడంతో ఈ విషయంను బాలిక కుటుంబ సభ్యులకు తెలిపింది. అగ్రహంతో రాత్రి బాధిత బాలిక కుటుంబ సభ్యులు, తాండా వాసులు  రెడ్యా నాయక్ ను చితక బాదారు. బాధితుల పిర్యాదు మేరకు రెంజల్ పోలిస్ స్టేషన్ లో అర్థరాత్రి పోక్సో కేసు నమోదు చేశారుపోలిసులు.

Tension in Veerannagutta Tanda

ఐతే బాలిక కుటుంబ సభ్యులు, తాండా వాసుల దాడిలో తీవ్రంగా గాయపడిన రెడ్యానాయక్ శుక్రవారం తెల్లవారు జామున చికిత్స పొందుతు ఆసుపత్రి చనిపోయారు. తాండాలో ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో  బోదన్ రూరల్ సిఐ విజయ్ బాబు అధ్వర్యంలో పోలిసులు బందోబస్తు ఎర్పాటు చేశారు. దాడి చేసిన వారిని ముందస్తుగా పోలిసులు అధుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.

 

Tension in Veerannagutta Tanda