Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 September 2025, 4:54 pm Posted by : ramakrishna

తాళ్ల రాంపూర్ లో ఉద్రిక్తత

  • పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరింపు

 

బతుకమ్మ, ఏర్గట్ల :  తాళ్ల రాంపూర్ గ్రామంలో గ్రామస్తులకు, గౌడ కులస్తులకు వివాదం జరిగిన విషయంపై మంగళ వారం పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించారు. మండలాల నుండి ఎస్సైలు, జిల్లా కేంద్రం నుండి స్పెషల్ పార్టీ పోలీసులు వచ్చి గ్రామానికి ఇరువైపులా భారీ కేడ్లు పెట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మా ల్వియా, ఆర్మూర్ ఎసిపి, వెంకటేశ్వర్లు,భీంగల్ సీఐ సత్యనారాయణ,ఏర్గట్ల తాసిల్దార్ మల్లయ్య, ఎస్సై రాజేశ్వర్,కాలినడకన తాళ్లరాంపూర్ గ్రామాన్ని రోడ్డు వెంబడ తిరిగి పోలీస్ బందోబస్తును పర్యవేక్షించారు.

Tension in Talala Rampur

ముందు జాగ్రత్తలు భాగంగా గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తలో భాగంగా పోలీస్ బలగాలతో 163 సెక్షన్ అమలులో ఉండడంతోపాటు, పోలీసులు ఇరు వర్గాలను శాంతింప చేసే దిశగా అడుగులు వేస్తూ ఇరు వర్గాలను శాంతింపజేసి ఉద్రిక్తత పరిస్థితులను అదుపులోకి తేవడానికి కృషి చేస్తున్నారు.

Tension in Talala Rampur