Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 February 2026, 9:17 pm Posted by : ramakrishna

మున్సిపల్ ఎన్నికల్లో ఉద్రిక్తత

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం లో మున్సిపల్ ఎన్నికల్లో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పోలీసులు పనిచేస్తున్నారు అంటూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్ గాంధీ చౌక్ లో ధర్నా చేపట్టారు. తమ పార్టీ అభ్యర్థుల ఇళ్ల లోకి పోలీసులు వెళ్లి తనిఖీలు చేస్తున్నారని కానీ కాంగ్రెస్ అభ్యర్థుల ఇళ్ల లో తనిఖీలు చేయడం లేదని వారన్నారు. ప్రచార సమయం ముగిసినప్పటికీ స్థానికేతర్లు ఇంకా మున్సిపల్ లోనే ఉన్నారని మండిపడ్డారు. అలాగే ఎమ్మెల్యే మదన్ మోహన్ పిఏలు వార్డుల్లో తిరుగుతూ ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈ ధర్నాలో బీఆర్ఎస్ నాయకలు తదితరులు పాల్గొన్నారు.

 

 

Tension in municipal elections