.ఫ్లెక్సీలు, కాషాయ జెండాల దహనం
. పోలీసుల భారీ బందోబస్తు
లింగంపేట్, బతుకమ్మ: మండల కేంద్రంలోని జంబి హనుమాన్ మందిరంలో ఫ్లెక్సీలు, కాషాయ జెండాలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. ఈ ఘటన అదివారం ఉదయం వెలుగు చూసింది. దీంతో మండల కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వర్గానికి చెందిన వ్యక్తుల పనేనని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు పికెట్, బందోబస్తు ఏర్పాటు చేశారు. గతంలోను ఇదే ఆలయంలో చోటు చేసుకున్న ఘటనలు ఉద్రిక్తత పరిస్థితికి దారీ తీశాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.