బడా భీమ్ గల్ లో ఉద్రిక్తత
ఇరువర్గాల మధ్య తలెత్తిన విభేదాలు ఫ్లెక్సీ తెచ్చిన రాద్ధాంతం భీమ్ గల్, బతుకమ్మ: మండలంలోని బడా భీమ్ గల్ గ్రామంలో మున్నూరు కాపు, మాల సంఘాల మధ్య ఫ్లెక్సీ విషయంలో జరిగిన గొడవ గురువారం ఉదయం ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.సంఘటన వివరాల్లోకి వెళ్తే గ్రామ నడిబొడ్డున ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద మున్నూరు కాపు యువకులు శివాజీ జయంతి సందర్బంగా ఫ్లెక్సీ కట్టారు. ఆ ఫ్లెక్సీ అంబేద్కర్ విగ్రహానికి అడ్డంగా ఉందని ఆ ఫ్లెక్సీని తొలిగింపజేయాలని కోరుతూ మాల సంఘ సభ్యులు స్థానిక...