- ఇరువర్గాల మధ్య తలెత్తిన విభేదాలు
- ఫ్లెక్సీ తెచ్చిన రాద్ధాంతం
భీమ్ గల్, బతుకమ్మ: మండలంలోని బడా భీమ్ గల్ గ్రామంలో మున్నూరు కాపు, మాల సంఘాల మధ్య ఫ్లెక్సీ విషయంలో జరిగిన గొడవ గురువారం ఉదయం ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.సంఘటన వివరాల్లోకి వెళ్తే గ్రామ నడిబొడ్డున ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద మున్నూరు కాపు యువకులు శివాజీ జయంతి సందర్బంగా ఫ్లెక్సీ కట్టారు. ఆ ఫ్లెక్సీ అంబేద్కర్ విగ్రహానికి అడ్డంగా ఉందని ఆ ఫ్లెక్సీని తొలిగింపజేయాలని కోరుతూ మాల సంఘ సభ్యులు స్థానిక గ్రామ కమిటీకి, పోలీసులకు ఫిర్యాదు చేశారు.పోలీసుల సూచన మేరకు శివాజీ ఫ్లెక్సీని మున్నూరు సంఘం యువకులు తీసివేశారు. సమస్య సద్దుమనగగా ఆ ఫ్లెక్సీ కట్టిన స్థలంలో గతంలో నీటి తొట్టి ఉండంగా అప్పటి సర్పంచ్ దాని తొలగించిన ఆదే స్థలం కొత్త నీటి తొట్టి కట్టిస్తానని చెప్పి తొలగించారు. ఆ తొట్టి నిర్మించలేదు. ఆనీటి తొట్టి ఆ వాడ లో నివసించేవారంతా పాత స్థలం లోనే నీటి తొట్టి నిర్మాణం పనిని ప్రారంభించారు. మల్లీ రాద్ధాంతం మొదలైంది. అక్కడ నీటి తొట్టి కట్టవద్దని మళ్ళీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు రంగప్రవేశం చేసి నీటి తొట్టి కట్టవద్దని, ఇరువర్గాలు మాట్లాడుకున్నాక కట్టాలని పోలీసులు చెప్పారు. అయినా వాడకట్టు వాళ్ళు నీటితొట్టి లేక పశువులకు ఇబ్బంది అవుతుందని ససేమీరా అని కట్టడానికి ప్రయత్నం చేశారు. పోలీసు అడ్డుకోవడంతో రాద్ధాంతం అయ్యింది. చివరికి సీ ఐ సత్యనారాయణ వచ్చి తనకు రేపటి వరకు సమయం ఇవ్వండి ఇరువర్గాలను కూర్చోబెట్టి మాట్లాడి కట్టుకుందురని చెప్పి ఒప్పించి పని నిలిపివేయించారు. సాయంత్రం నీటి తొట్టి భాధితులని ఆర్మూర్ ఏసీ పీ రమన్నారని సీ ఐ చెప్పగా రేపు వస్తామని చెప్పారు. బడా భీమ్ గల్ సింహ భాగం మున్నూరు కులస్థులే ఉంటారు. ఈ మున్నూరు కాపు కు సంబంధించి 9 సంఘాలు గురువారం మీటింగ్ పెట్టుకొన్నారు. ఏసీపీ ని కలిసేందుకు సుమారు 800 మంది మున్నూరు కాపు సంఘాల సభ్యులు నేడు వెళ్ళనున్నారు. గ్రామంలో ఎలాంటి గొడవలకు తావు ఇవ్వకుండా సంఘటన స్థలం వద్ద పోలీసు పీకేటింగ్ ఏర్పాటు చేశారు.
