Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 May 2026, 12:46 pm Posted by : ramakrishna

తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత

 

 

. . . తెలంగాణ భవన్ ను చుట్టుముట్టిన పోలీసులు

 

. . .  భవన్ లోనే మూడు రోజులుగా మాజీ విప్ బాల్కసుమన్

 

. . . పోలీసులను అడ్డుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

నాంపల్లి పీఎస్ లో మాజీ విప్ బాల్కసుమన్ పై నమోదైన కేసు విషయంలో నోటీసులు ఇచ్చి అరెస్టు చేసేందుకు వచ్చిన పోలీసులను టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. సింగరేణి విషయంలో ఇటీవల బాల్కసుమన్ సింగరేణి ఆస్తులను ధ్వంసం చేయాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసింది. సుమన్ పై నాంపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కాగా పోలీసులు అరెస్టు చేస్తారని మూడు రోజులుగా తెలంగాణ భవన్ లోనే ఉంటున్నారు. శనివారం ఏసీపీ ప్రవీణ్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్ కు రాగా బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నారు. బాల్కసుమన్ పై అక్రమ కేసులు నమోదు చేశారని, పోలీసులు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. చివరకు పోలీసులు టాస్క్ ఫోర్స్ ను రంగంలోకి దించి బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారు. గత మూడు రోజులుగా బాల్కసుమన్ కోసం వెతుకుతున్నామని, అతను ఉన్నాడనే సమాచారం మేరకే తెలంగాణ భవన్ కు వచ్చామని ఏసీపీ తెలిపారు. పోలీసుల దర్యాప్తునకు సహకరించాలని కోరారు. తాము నోటీసులు ఇచ్చి చట్టపరంగానే అదుపులోకి తీసుకుని విచారిస్తామని ఏసీపీ తెలిపారు. తెలంగాణ భవన్ చుట్టురా పోలీసులు మోహరించడంతో ఉద్రిక్త పరిస్థితులునెలకొంది. ఏ క్షణమైన బాల్కసుమన్ ను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించే అవకాశం ఉంది.  బాల్క సుమన్ మాట్లాడుతూ  ప్రభుత్వం తనపై కక్షగట్టిందని, ఇటీవల రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అక్రమ మైనింగ్ వ్యవహరాన్ని బహిర్గతం చేసినందుకే కేసులు పెడుతుందని ఆరోపించారు. ఉద్యమ కాలంలో 226 కేసులు నమోదయ్యాయని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రికార్డు బద్దలు కొట్టాలని ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు.