Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 December 2025, 1:28 pm Posted by : ramakrishna

బంగ్లాదేశ్ హైకమిషన్ వద్ద ఉద్రిక్తత

డిల్లీ, బతుకమ్మ : డిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ వద్ద మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బంగ్లాలో హిందువులపై దాడులను ఖండిస్తూ కార్యాలయం వద్ద వీహెచ్ పీ  కార్యకర్తలు నిరసన చేపట్టారు. బారీకేడ్లు నెట్టుకొని లోపలికి వెళ్లేందుకు యత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా పోలీసులు అప్రమత్తయ్యారు. బజ్ రంగ్ దళ్ కూడా ఈనిరసనలో పాల్గొంది. ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శిస్తూ ఎంబసీ వద్ద నినాదాలు చేశారు. దీంతో పోలీసులతో పాటు పారామిలటరీ బలగాలను రంగంలోకి దించారు. మూడు అంచెల్లో బారికేడ్లను ఏర్పాటు చేశారు. కాగా, మరో మతానికి వ్యతిరేకంగా ఆరోపణలు చేశారని బంగ్లాదేశ్ లో 25 ఏళ్ల దీపూ చంద్ర దాస్ పై గతవారం మూక దాడి చేసిన విషయం తెలిసిందే.