Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 June 2026, 4:15 pm Posted by : ramakrishna

కౌలు రైతులకు కౌలు కార్డులు ఇచ్చి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలి

 

. . . ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య

మోపాల్, బతుకమ్మ:

కౌలు రైతులకు కౌలు కార్డు లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ప్రభుత్వపరంగా ఏ సంక్షేమ పథకాలు వారికి అందడం లేదని కౌలు రైతులకు కౌలు కార్డులు ఇవ్వాలని ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య  అన్నారు. ఆదివారం మోపాల్  మండలంలోని తనకుర్డు గ్రామంలో దొడ్డి కొమురయ్య ట్రస్ట్ భవనంలో ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో భూమయ్య మాట్లాడుతూ… ప్రభుత్వం కౌలు రైతులకు కౌలు గుర్తింపు కార్డులు అందించి వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గ్రామాలలో గ్రామ సభల ద్వారా రెవెన్యూ అధికారుల సమక్షంలో ఎంతమంది కౌలు రైతులు కౌలు చేస్తున్నారని గుర్తించాలని వారు అన్నారు. ప్రభుత్వం బ్యాంకర్ల చేత వారి పంట పెట్టు బడులకు గాను కౌలు కార్డు ఆధారంగా రుణాలు అందించాలని, రైతు భరోసా ఇవ్వాలని, ధాన్యం అమ్మగా వచ్చే రూపాయలు కౌలు రైతుల ఖాతాలో నేరుగా జమ చేయాలని అన్నారు. దీనితో పాటు పంటల బీమా సౌకర్యం కల్పించాలని, బోనస్ కౌలు రైతుల   ఖాతాలో వేసి  ప్రభుత్వ పరంగా ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలని అఖిలభారత రైతు కూలి సంఘం ఏఐకేఎంఎస్  తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని భూమయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో సాయన్న, భూజేందర్, తదితరులు పాల్గొన్నారు

Tenant farmers should be given tenancy cards and provided with government welfare schemes