కామారెడ్డి, బతుకమ్మ : నిజామాబాద్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ స్వప్న ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా గాంధారి మండలం దుర్గం గ్రామంలో తనిఖీలు నిర్వహించారు. తనిఖీలలో భాగంగా ధరావత్ హనుమంతు అనే వ్యక్తి సాగు చేస్తున్న 10 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. రెండు వందల లీటర్ల వైట్ వాష్, రెండు లీటర్ల సారా 6 కిలోల బెల్లం ఇతర సామాగ్రిని ధ్వంసం చేసి స్వాధీనం చేసుకున్నారు.
