తాత్కాలికంగా సెంట్రల్ లైటింగ్ పనుల నిలిపివేత
బతుకమ్మ పిట్లం : పిట్లం మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ పనులలో భాగంగా రోడ్డు కిరువైపులా మట్టిని తవ్వి రోడ్డు పనులు చేస్తుండగా, అర్ధాంతరంగా గురువారం రోజు అంబేద్కర్ చౌరస్తాలో ఒకవైపు జెసిబి పనులను ప్రారంభించగా, స్థానికులు అడ్డుకున్నారు. రోడ్డు ఇరువైపుల మట్టిని తవ్వి గుంతలను చేస్తే ప్రస్తుతం దసరా ఉన్నందున, చాలా ఇబ్బందులు ఏర్పడతాయని పనులను దసరా వరకు ఆపివేసి దసరా అనంతరం చేపట్టాలని ప్రజలు ఆర్ అండ్ బి అధికారులను విన్నవించారు. ఈ సందర్భంగా స్థానిక కాంగ్రెస్ కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు...