Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 September 2025, 8:22 pm Posted by : ramakrishna

భిక్నూర్ మండలంలో ఆలయాల దొంగతనాల కేసుల ఛేదన

బతుకమ్మ, భిక్కనూరు : భిక్కనూరు మండలంలోని బస్వాపూర్ గ్రామంలో గత కొన్ని రోజుల క్రితం ఎల్లమ్మ పెద్దమ్మ ముత్యాలమ్మ ఆలయాల్లో జరిగిన దొంగతనాల కేసును పోలీసులు చేదించారు. శుక్రవారం జిల్లా ఎస్పీ కేసు కు సంబంధించిన వివరాలను వెల్లడించారు. సదాశివ నగర్ మండలం చెందిన గాంధారి సత్యం కామారెడ్డి చెందిన సమీర్, అహమ్మద్ పఠాన్ ముఠాగా ఏర్పడి ముఠాగా ఏర్పడి  ఎన్ఎచ్ -44 దగ్గరలోని దేవాలయాలను టార్గెట్  చేసి వాటి తాళాలు, హుండీలు పగలగొట్టి దొంగతనాలు చేస్తున్నారని అన్నారు. ఈ మేరకు బస్వాపూర్ జాతీయ రహదారి పక్కన ఉన్న ముత్యాలమ్మ ఎల్లమ్మ , పెద్దమ్మ ఆలయాల్లో హుండీలను పగలగొట్టి నగదు తో పాటుగా వెండి వస్తువులను ఎత్తుకెళ్లారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయగా సీసీ కెమెరాల ఆధారంగా చాకచక్యంగా భిక్కనూరు సిఐ సంపత్ ఎస్ఐ ఆంజనేయులు, సిసిఎస్ పోలీసులు  ఆధ్వర్యంలో గాంధారి సత్యం సమీర్ ను అరెస్ట్ చేయగా, అహమ్మద్ పఠాన్ పరారీలో ఉన్నారని తెలిపారు. వీరి వద్ద నుండి వెండి కళ్ళు&సామగ్రి, మొబైల్ ఫోన్, రూ.5000/-నగదు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. కాగా వీరు మెదక్ జిల్లా రామాయంపేట 44 జాతీయ రహదారి పక్కన ఉన్న ఆలయాలు సైతం దొంగతనాలు పాల్పడినట్లు తెలిపారు. ఈ కేసును చేదించిన  సీసీఎస్, భిక్నూర్ పోలీసులను  జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించారు.

Temple theft cases solved in Bhiknur mandal