‘శ్రీమద్రామాయణం’కు తెలుగు విశ్వవిద్యాలయ సాహితీ పురస్కారం
హైదరాబాద్, బతుకమ్మ : ప్రముఖ కవి, తెలంగాణ గవర్నర్ జాయింట్ సెక్రటరీ, సీనియర్ గ్రూప్-1 అధికారి శశికిరణ్ కొమాండూర్ రచించిన పద్య మహాకావ్యం ‘శ్రీమద్రామాయణం’ ప్రతిష్ఠాత్మక సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయ సాహితీ పురస్కారానికి ఎంపికైంది. 2024 సంవత్సరానికి గాను ఈ పురస్కారం ఆయన రచనకు దక్కింది. పరిపాలనా బాధ్యతలను నిర్వర్తిస్తూనే గత రెండు దశాబ్దాలుగా శశికిరణ్ కొమాండూర్ సాహిత్య సాధన కొనసాగిస్తున్నారు. సామాన్య పాఠకుడికి సైతం సులభంగా అర్థమయ్యే వాడుకభాషలో, ఛందోబద్ధంగా ‘శ్రీమద్రామాయణం’ను ఆయన రచించారు. ప్రముఖ ప్రచురణ సంస్థ...