గిరిరాజ్ కళాశాలలో  “తెలుగు సాహిత్యం-ప్రదర్శన కళలు” కార్యశాల

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ లోని గిరిరాజ్  ప్రభుత్వ కళాశాలలో కొరవి గోపరాజు తెలుగు విభాగం ఆధ్వర్యంలో బుధవారం "తెలుగు సాహిత్యం- ప్రదర్శన కళలు" అంశంపై బుధవారం కార్యశాలను నిర్వహించారు. కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ రంగరత్నం సభాధ్యక్షత వహించి మాట్లాడారు. విద్యార్థి మానసిక వికాసానికి కళలు ఎంతో  సహకరిస్తాయని తెలుగు అధ్యాపకులందరికీ అభినందనలు తెలిపారు.  ఇందూరులో ఎంతోమంది వ్యాఖ్యాతలు, కవులు, కళాకారులు ఉన్నారని, వారి సహకారంతో కళాశాల విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అవగాహనను కల్పించి, వారిలో నైపుణ్యాలను పెంపొందించేందుకు ఈ కార్యశాలను ఏర్పాటు...