ఘనంగా తెలుగు భాషా దినోత్సవం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల, కొరవి గోపరాజు తెలుగు విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం వ్యవహారిక భాషా పితామహుడు గిడుగు జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవంను నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా.పి.రామ్ మోహన్ రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించి, మనందరం తెలుగు భాషను కాపాడుకోవాలని సూచించారు. వైస్ ప్రిన్సిపాల్ డా. రంగరత్నం మాట్లాడుతూ... మాతృభాషను కాపాడుకోవడం అంటే మన చరిత్రను, సంస్కృతిని, అస్థిత్వాన్ని కాపాడుకోవడం అని అన్నారు. ఐ.క్యూ.ఏ. సి.కో-ఆర్డినేటర్ డాక్టర్ రాజేశ్ అన్ని భాషలు ముఖ్యమే అయినప్పటికీ మాతృభాషను కాపాడుకోవాలని,...