భీమ్ గల్, బతుకమ్మ : భారత్ లో ప్రధాని మోడీ తీసుకొచ్చిన స్వచ్ఛ భారత్ అభియాన్ పథకం తో ప్రేరణ పొందిన ప్రవాస భారతీయులు బెహరాన్ లో ఏర్పాటు చేసుకొన్న తెలుగు ఎకో వారియార్స్ స్వచ్చంద సంస్థ మొదటి సంవత్సర అనవర్సరీ వేడుకలను అక్కడి సీఫ్ భీచ్ లో అట్టహాసంగా నిర్వహించుకొన్నారు.ఆదివారం నిర్వహించిన ఈ అనవర్సరీ వేడుకులు తెలుగు ఎకో వారియర్స్ జట్టుకు ఎంతో ఆనందాన్ని ఇవ్వగ, వారు కొందరుగా జత కట్టిన జట్టు సమూహం పెద్దదిగా ఎదగడం సంతోషాన్ని ఇస్తుందని తెలిపారు. వారానికి ఒక్క రోజు భీచ్ లో చెత్త చేద్దారాన్ని విధిగా తీసివేయడం, అక్కడ ఉన్న అందరికి చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయవద్దని అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ఏడాదిగా రెగ్యులర్ గా నిర్వీస్తున్నట్లు సంస్థ సభ్యులు వెల్లడించారు. ఈ బృందం అంకిత భావంతో నిర్వీరమంగా నిర్వహిస్తున్న ఈ క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం వారికి ఎంతో ప్రేరణ కల్పించినట్లు వారు తెలిపారు. ఇలాంటి పర్యావరణ ఉద్యమాలు మా ప్రయత్నం తో ముందుకు వెళ్లడం మూలాన మరింత మంది స్వచ్చంద సేవకులకు భవిష్యత్ లో అవకాశం కలిపించిన వారమౌతామని, మా ప్రయత్నం క్లీన్ బెహరాన్ కావాలని బృందం ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం లో తెలుగు ఎకో వారియార్స్ సభ్యులు నవీన్ కుమార్, రాం మోహన్ కొత్తపల్లి, మహేష్ మీరా, పెప్సీ అశోక్, పెప్సీ బుయాని గంగాధర్, పెప్సీ తిరుపతి, పరమేశ్వర్, అరవింద్, నవీన్, గంగారెడ్డి, రంజిత్, సుమన్, ఎర్రోళ్ల సుమన్ పెప్సీ, సతీష్, శేఖర్, వంశీ కృష్ణ, సురేష్, సుధాకర్, వంశీకృష్ణ, భీమేష్, సాగర్, నరేందర్, రాజు, తిరుపతి గౌడ్, కిరణ్, మధు గౌడ్, మైదాం సురేష్,సాయి కుమార్, తదితరులు పాల్గొన్నారు.
