ఘనంగా తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
రుద్రూర్, బతుకమ్మ : తెలుగుదేశం పార్టీ 43 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో తెలుగుదేశం పార్టీ శాఖ ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి పార్టీ జెండాను ఎగురవేయడం జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు మాట్లాడుతూ.. తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో అన్న నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించారన్నారు. ఈ కార్యక్రమంలో...