తెలంగాణ సాధించిన శక్తి కేసీఆర్

హైదరాబాద్, బతుకమ్మ: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎం రేవంత్ రెడ్డి గురువులకే చక్కులు చూపించి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించారని, పీకేయడానికి ఆయన మొక్క కాదు వేగుచుక్క అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. హైదరాబాద్ లోని తన నివాసంలో సోమవారం నిర్వహించిన కోరుట్ల నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ముఖ్య మంత్రి రేవంత్ తోపాటు మంత్రులు తిట్ల పరిపాలన చేస్తున్నారని, రాష్ర్టంలో ఒకప్పుడు నిధులు వదలాపారితే ఇప్పుడు తిట్లు...