Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 December 2025, 6:22 pm Posted by : ramakrishna

ఘనంగా తెలంగాణ విజయ్ దివస్

 

.. .  అంబేద్కర్ విగ్రహం వద్ద గాలిలోకి బెలూన్ లు

. . . బి ఆర్ ఎస్ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం

. . . జిల్లా జనరల్ ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ

 నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:

తెలంగాణ విజయ్ దివస్ కార్యక్రమం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మంగళవారం బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, నగర మాజీ మేయర్ దండు నీతూ కిరణ్, మాజీ జడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠల్ రావు లు , నగర అధ్యక్షుడు సిర్పరాజు ఆధ్వర్యంలో ఉదయం నుంచి సంబరాలు నిర్వహించారు.

 

Telangana Vijay Diwas celebrated in grand style

ఉదయం  జిల్లా పార్టీ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి జై తెలంగాణ నినాదాలు చేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర స్వప్నం సాకారం అయ్యిందంటే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ ప్రజల దశాబ్దాల వాంఛ నెరవేరిన సందర్భంగా పూలాంగ్ చౌరస్తాలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి, స్వేచ్ఛ వాయువులు పొందిన సందర్భంగా బెలూన్ గాలిలో వదిలారు.

Telangana Vijay Diwas celebrated in grand style

 

తర్వాత జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసిన కేసీఆర్ సాధించిన తెలంగాణ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గారు మాట్లాడుతూ 29 నవంబర్ 2009 వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కై టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో నినాదంతో ఆమరణ నిరాహార దీక్ష కారణం అన్నారు.అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కెసిఆర్ దీక్షను భగ్నం చేయడానికి అక్రమంగా అరెస్టు చేసిన నిరాహార దీక్షను కొనసాగించారు గుర్తు చేశారు. ఈ ప్రాంత అభివృద్ధికి రాష్ట్ర ఏర్పాటు ఒక్కటే మార్గమని ఏ ఇతర ప్రత్యామ్నాయాలు అవసరం లేదని కేసీఆర్ చేపట్టిన  ఆమరణ నిరాహార దీక్ష తో రోజురోజుకు క్షీణిస్తున్న ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రజల దశాబ్దాల కాలం పోరాటానికి తల వంచి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణ  రాష్ట్ర ఏర్పాటును ప్రారంభిస్తున్నామని ప్రకటన చేసిందన్నారు. ఈ సందర్భంగా  డిసెంబర్ 9న తెలంగాణ విజయ్ దివాస్ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపు మేరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

Telangana Vijay Diwas celebrated in grand style