తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ
బతుకమ్మ, బిచ్కుంద : భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి నుంచి విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన తెగువ, పౌరుషం తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని చాటి చెప్పాయని కాంగ్రెస్ యువ నాయకులు భాస్కర్ రెడ్డి అన్నారు. బుధవారం బిచ్కుంద మండల కేంద్రంలోని రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 40 వ వర్ధంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన...