తెలంగాణ విశ్వవిద్యాలయానికి న్యాక్ గుర్తింపు కోసం సిద్ధం కావాలి
వైస్ ఛాన్స్ లర్ ఆచార్య టి.యాదగిరిరావు నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఉన్నత విద్యాసంస్థలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఆర్థికపరమైన మద్దతుకు న్యాక్ అక్రిడియేషన్ తప్పనిసరి అయిందని తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య టీ యాదగిరిరావు పేర్కొన్నారు. తెయూలోని పరిపాలన భవనంలో గల ఎగ్జిక్యూటివ్ హల్ లో తెలంగాణ విశ్వవిద్యాలయ విభాగాధిపతులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి వైస్ ఛాన్స్లర్ ఆచార్య టి యాదగిరిరావు మాట్లాడుతూ విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతుల కల్పనకు, బోధన సిబ్బంది, పరిశోధకులకు అవసరమైన ప్రాజెక్టుల నిర్వహణకు ,...