తెలంగాణ యూనివర్సిటీకి ఈశ్వరీ బాయి పేరు పెట్టాలి

నిజామాబాద్ సిటీ,  బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ విశ్వవిద్యాలయానికి తెలంగాణ పోరాట యోధురాలు జె. ఈశ్వరీ బాయి పేరు పెట్టి  "ఈశ్వరీ బాయి తెలంగాణ విశ్వవిద్యాలయం" గా మార్చాలని ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారను. ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఆల్ మాల స్టూడెంట్స్ అసోసియేషన్ (అంసా) రాష్ట్ర అధ్యక్షుడు అంగరి ప్రదీప్ అధ్యక్షతన జరిగిన ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఎస్సీ,...