Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 October 2024, 5:09 pm Posted by : ramakrishna

తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఇంటర్ కాలేజ్ మెన్స్ కబడ్డీ సెలక్షన్స్

డిచ్పల్లి, బతుకమ్మ : తెలంగాణ యూనివర్సిటీ వైస్- ఛాన్స్లర్  ఆచార్య. టి. యాదగిరి రావు ఆదేశాల మేరకు తెలంగాణ యూనివర్సిటీ ఇంటర్ కాలేజ్ కబడ్డీ మెన్ సెలెక్షన్స్ శనివారం విశ్వవిద్యాలయం క్రీడా మైదానంలో  నిర్వహించామని వర్సిటీ డైరెక్టర్ స్పోర్ట్స్ డా జి బాలకిషన్ తెలిపారు.  ఈ సెలెక్షన్స్ కి ఉమ్మడి జిల్లా నుండీ దాదాపు 50 మంది క్రీడాకారులు పాల్గొన్నారని పేర్కొన్నారు. సందీప్, ఎస్ ఆర్ న్ కె బాన్స్వాడ , ఆకాష్, గోవింద్, శివ, మనోహిత్, నర్సింహా మోహిత్ యూనివర్సిటీ కాలేజీ సిద్దార్థ్, నరేష్, నరేష్ గిరిరాజ్ కాలేజీ శివ ఎస్ఎసల్ బాన్స్వాడ సందీప్ జి డి సి కామారెడ్డి అభిలాష్ మోర్తాడ్ కార్తీక్ ఎస్ ఎస్ ఆర్, సాయికుమార్ జీడీసి ధర్పల్లి విద్యార్థుల ను ఎంపిక చేశామని తెలిపారు.  ఈ ఎంపికైన వర్సిటీ కబడ్డీ టీం చెన్నై లో 29 నుండి 04 వరకు జరుగు సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ కబడ్డీ టోర్నమెంట్ లో పాల్గొంటుందని ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ బి ఆర్ నేత తెలిపారు. ఈ సెలెక్షన్స్ లో జి జి కళాశాల, వివిధ కళాశాలల పి.డీలు  డాక్టర్ బాలమణి, డాక్టర్ కుమారస్వామి,  ప్రశాంత్, బుచ్చన్న  వివిధ కళాశాలల ఇంచార్జి లు మరియు క్రీడాకారులు పాల్గొన్నారు.

Telangana University Inter College Men's Kabaddi Selections