Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 April 2026, 6:47 pm Posted by : ramakrishna

తెలంగాణ విశ్వ విద్యాలయం  పాలక మండలి నియామకం

 

. . . డైరెక్టర్ గా కాకతీయ రజనీకాంత్

 నిజామాబాద్, బతుకమ్మ :

తెలంగాణ విశ్వవిద్యాలయం ద్వితీయ శ్రేణి సభ్యులతో కూడిన పాలక మండలిని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ఉన్నత విద్యామండలి తరపున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. యోగితా రాణా ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ యూనివర్సిటీ యాక్ట్ 1991 ప్రకారం నూతనంగా పాలక మండలి సభ్యులు నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

Telangana University Governing Council Appointment
Telangana University Governing Council Appointment

తెలంగాణ విశ్వవిద్యాలయం నుంచి నామినేటెడ్  కోటాలో డిపార్ట్మెంట్ ఆఫ్ బిజినెస్ మెనేజ్ మెంట్ ప్రోపేసర్ ఆంజనేయులు, యూనివర్సిటీలోని  ఓక విభాగం ప్రిన్సిపాల్ ను నామినేట్ చేయాల్సిన కోటా  జియో ఇన్ఫర్మేటిక్స్ డిపార్ట్మెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ డా. సుధాకర్ గౌడ్, అఫిలియేట్ కాలేజీ ల తరపున ఒక ప్రిన్సిపాల్ గా  గౌతమి కాలేజీ ప్రిన్సిపాల్ డా. కే. సంజీవ రావు, యూనివర్సిటీ పరిధిలోని ఒక కాలేజీ లెక్చరర్ గా గిరిరాజ్ కాలేజ్ అసిస్టెంట్ ప్రోఫేసర్ దండు స్వామీని , అఫ్లీయేటేడ్ కాలేజీల నుంచి ఓక అధ్యాపకుడిగా ఇందూర్ పీజీ కాలేజ్ ఆఫ్ బిజినెస్ మెనేజ్ మెంట్ కాలేజీ ప్రో. మదన్ మోహన్ ను నామినేట్ చేశారు. యూనివర్సిటీ పరిధిలోని వాణిజ్య, వ్యాపార, వ్యవసాయ, విద్యావేత్తలతో పాటు సామాజిక రంగాల్లో నిష్ణాతుల కేటగిరిలో కాకతీయ విద్యాసంస్థల డైరెక్టర్ చెరుకూరి రజనీకాంత్, మహమ్మద్ ఘాజీ (జర్నలిస్ట్), డా. ఎస్ జయంత్ ను నియమించారు.

Telangana University Governing Council Appointment