నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని పరీక్షల విభాగం ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం వైస్ ఛాన్సల ర్ చాంబర్లో డిగ్రీ – మొదటి సెమిస్టర్ (సీబీసీస్) ఫలితాలను (నవంబర్ / డిసెంబర్ 2025) తెలంగాణ వర్సిటీ వైస్ ఛాన్స్ లర్ టీ.యాదగిరి రావు విడుదల చేసారు. ఈ సందర్బంగా వైస్ ఛాన్స్ లర్ మాట్లాడుతూ పరీక్ష ఫలితాలను తొందరగా విడుదల చేసి విద్యార్థులు ముందస్తు జాగ్రత్తగా కాంపిటీటివ్ పరీక్షలకు సిద్దమయ్యేలా సహకరిoచిన పరీక్షల విభాగాన్ని అభినoదిస్తూ మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అభినందనలు తెలియచేసారు. రిజిస్ట్రార్ ఆచార్య ఎం.యాదగిరి మాట్లాడుతూ విశ్వవిద్యాలయ పరిధిలోని అన్ని పరీక్షా ఫలితాల వెల్లడిలో ఇలాగే ముందుండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య రాంబాబు, డైరెక్టర్ ( వీఆర్వో) డా. రమణాచారి. అడిషనల్ కంట్రోలర్స్ ఆఫ్ ఎగ్జామ్స్ డా.నందిని, డా. సంపత్ పాల్గొన్నారు.