ఆన్ లైన్ షాపింగ్ లో తెలంగాణ టాప్

వెబ్ న్యూస్, బతుకమ్మ :  దక్షిణాది రాష్ట్రాల్లో ఆన్ లైన్ షాపింగ్ లో తెలంగాణ టాప్ లో నిలిచినట్లు ఓ సర్వేలో వెల్లడైంది. ఈరాష్ట్రాల్లో ఆన్ లైన్ షాపింగ్ వేగంగా అభివృద్ధి చెందుతున్నట్లు సర్వే పేర్కొంది. తెలంగాణ రాష్ట్రంలో  24.5 శాతం ప్రజలు ఆన్ లైన్ షాపింగ్ కు మొగ్గు చూపుతున్నారు. తర్వాతి స్థానాల్లో పుదుచ్చేరి, కర్నాటక, కేరళ, తమిళనాడు, ఏపీ ఉన్నాయి. సాంకేతిక అక్షరాస్యత,  ఇంటర్నెట్ వాడకం ఎక్కువగా ఉండటమే ప్రధాన కారణమని సర్వే తెలిపింది.