Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 September 2025, 5:48 pm Posted by : ramakrishna

తెలంగాణ స్టేట్ రిటైర్డ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గ సమావేశం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ స్టేట్ రిటైర్డ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గ సమావేశం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో శనివారం నిర్వహించారు.ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు సాయి రెడ్డి అధ్యక్షత వహించారు. రాష్ట్ర అధ్యక్షులు సుంకం కోటేశ్వరరావు ఈ సమావేశానికి హాజరై ఉద్యోగులు, పెన్షనర్లు అనేక అంశాలపై ప్రభుత్వం నిర్లక్ష్యానికి బలి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడలేని విధంగా కేవలం మూడు రాష్ట్రాలలో కర్ణాటక హిమాచల్, తెలంగాణ రాష్ట్రంలో ఐదు డిఏలు పెండింగ్లో ఉన్నాయన్నారు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయమని అదేవిధంగా జీవో ఎంఎస్ నెంబర్ 317 ఉద్యోగులను  వారి స్వస్థలాలకు పంపిస్తామని సిసిఎస్ రూల్స్ రద్దు చేస్తామని ఇచ్చిన హామీ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు అమలు చేయలేదని అన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి వీటిని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాకు అత్యంత ప్రాంతానికి ప్రాధాన్యతనిచ్చి ల్లాకు చెందిన శ్రీ సుంకం కోటేశ్వరరావు ని రాష్ట్ర అధ్యక్షులుగా రాష్ట్ర సంఘం నియమించినందుకు రాష్ట్ర పాలకవర్గానికి నిజామాబాద్ అగ్రికల్చర్ ఆఫీసర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రాజు నాయక్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడిని రాజు నాయక్ ఘనంగా సన్మానించారు.

Telangana State Retired Agriculture Extension Officers Welfare Association District Executive Committee Meeting