నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాదు జిల్లా శాఖ రెడ్ క్రాస్ కార్యాలయం, రక్తనిధి, తలసేమియా కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర రెడ్ క్రాస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.శ్రీరాములు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా పని తీరును తెలుసుకొని జిల్లా శాఖ చేపడుతున్న కార్యక్రమాలకు జిల్లా చైర్మన్ బుస్స ఆంజనేయులుకి, కార్యవర్గానికి అభినందలు తెలుపుతూ కొన్ని సూచనలు తెలిపారు. జిల్లా రెడ్ క్రాస్ సభ్యులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఈ సందర్భంగా ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా చైర్మన్ బుస్స ఆంజనేయులు,రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్ , కోశాధికారి కరిపే రవీందర్ , కార్యదర్శి గోక అరుణ్ బాబు , నిజామాబాదు డివిజన్ చైర్మన్ డా.శ్రీశైలం, జూనియర్ రెడ్ క్రాస్ సమన్వయ కర్త అబ్బాపూర్ రవీందర్ ,బ్లడ్ బ్యాంకు మెడికల్ ఆఫీసర్ రాజేశ్వర్ ,పి.ఆర్.ఓ బొద్దుల రామకృష్ణ మరియు రెడ్ క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు.
