. . . ఆర్ఎస్ పి రాష్ట్ర కమిటి సభ్యులు అనిల్
నిజామాబాద్ సిటి, బతుకమ్మ:
అసెంబ్లి ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టి అటో డ్రైవర్ల కు ప్రతినెల రూ.12 వేలు ఇస్తామని ఇచ్చిన హమీని అమలు చేసి అదుకోవాలని ఆర్ఎస్ పి రాష్ట్ర కమిటి సభ్యులు అనిల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ధ నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు అనిల్ మాట్లాడుతూ …తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా ఆటో కార్మికుల జీవితాలను నాశనం చేసిందని అన్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఆటో కార్మికులకు జీవన భృతిని కల్పించాలని అన్నారు అదేవిధంగా ఇన్సూరెన్స్ రోడ్ టాక్స్ ప్రభుత్వమే భరించి ఆటో కార్మికులను ఆదుకోవాలని కోరారు. ఆటో కార్మికుల సేవలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని అన్నారు బస్సులు అంబులెన్స్ లు కూడా వెళ్లలేని ప్రాంతాలలో ఆటోలు వెళ్లి జనాలకు సౌకర్యంగా సేవలో అందిస్తున్న ఆటో కార్మికుల సేవలు అభినందనీయమని అన్నారు

యూటియూసీ కార్మిక సంఘంలో చేరిన కాకతీయ ఆటో స్టాండ్ నాయకులు….
ఆర్ ఎస్ పి, యూటియూసీ ఉద్యమాలకు ఆకర్షితులై నిజామాబాద్ లోని ఇతర కార్మిక సంఘాలలో పనిచేస్తున్న కాకతీయ ఆటో స్టాండ్ యూనియన్ ఆర్ ఎస్ పి కన్వీనర్ కటారి రాములు ఆధ్వర్యంలో యు టి యు సి లో చేరడం జరిగింది. ఈ సంధర్బాంగా కన్వీనర్ కటారి రాములు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికుల సంక్షేమం కోసం బోర్డును ఏర్పాటు చేసి వారిని ఆదుకోవాలని అన్నారు.అదేవిధంగా నన్ను నమ్మి యుటియుసి లో చేరిన కార్మికుల పక్షాన వారికి ఎటువంటి కష్టం వచ్చిన వెనుక ఉండి పోరాట పోరాడడానికి సిద్ధంగా ఉన్నా అంటూ వారికి ధైర్యం ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఆర్ వైఎఫ్ జిల్లా కన్వీనర్ పిట్ల నరేష్, జిల్లా ఉపాధ్యక్షులు గోపాల్ సింగ్ ఠాకూర్ , ఆటో యూనియన్ నాయకులు అబ్దుల్ ముజీబ్, అనీష్, ఇమ్రాన్ ఖాన్, సయ్యద్ రఫీ ఉద్దీన్, సయ్యద్ ఇర్ఫాన్ ,సయ్యద్ అజ్జు, ఎండి అయూబ్, మహమ్మద్ నిజాముద్దీన్, ఎస్కే మజ్జు, తదితరులు పాల్గొన్నారు