తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
బాన్సువాడ, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తన నివాసం వద్ద, ఎంఎల్ఏ క్యాంపు కార్యాలయ ఆవరణలో జాతీయ జెండాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర, బాన్సువాడ నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు, సబ్ కలెక్టర్ కిరణ్మయి, బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.