బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వినాయక్నగర్లో గల అమరవీరుల స్థూపం వద్ద ఘనంగా నివాళులర్పించారు. సాధించుకున్న తెలంగాణ ఎంతోమంది త్యాగధనుల త్యాగాల ఫలితమే అని బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం కొరకు ప్రాణాలర్పించిన మహనీయుల బాటలో సాగి బంగారు తెలంగాణ నిర్మాణంలో బీసీ సంక్షేమ సంఘం ఎప్పుడు ముందుంటుందని ఈ సందర్భంగా తెలియజేసారు. కానిస్టేబుల్ కిష్టయ్య నుండి కాసోజు శ్రీకాంత...