ఎల్లారెడ్డిలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కురుమ సాయిబాబా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు కృషి చేసి తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన సోనియా గాంధీ కి, కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ...