Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 June 2026, 8:22 pm Posted by : ramakrishna

ఎల్లారెడ్డిలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

 

ఎల్లారెడ్డి, బతుకమ్మ :

 

ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కురుమ సాయిబాబా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు కృషి చేసి తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన సోనియా గాంధీ కి, కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమర వీరులను స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించారు. అలాగే ఎల్లారెడ్డి నియోజకవర్గంలో శాసనసభ్యులు మదన్ మోహన్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తూ ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు కలిసి “జై తెలంగాణ – జై కాంగ్రెస్” అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్, ఏఎంసీ చైర్‌పర్సన్ రజిత వెంకట్రాం రెడ్డి, మహిళా కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.