Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 June 2026, 8:01 pm Posted by : ramakrishna

ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

 

ఇందల్వాయి, బతుకమ్మ :

 

ఇందల్వాయి మండలంలోని గన్నారం గ్రామ సచివాలయం ముందు సర్పంచ్ కరణం సుజాత శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ మలిదశ పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన తెలంగాణ అమరవీరులకు జోహార్లు అర్పించారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ తెలంగాణ మలిదశ పోరాటంలో అనేకమంది ఉద్యమ ఫలితమే నేడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భామన్నారు. కానీ కేసీఆర్ దీక్ష తోనే తెలంగాణ వచ్చిందని ప్రగల్భాలు పలుకుతున్న నాయకులు ఆనాడు తెలంగాణ రాష్ట్ర సమితికున్న పార్లమెంటు స్థానాలు ఎన్నో గుర్తు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా సోనియాగాంధీ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రకటన చేసి అనంతరం మాట తప్పకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీకి దక్కుతుందన్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఉప సర్పంచ్ బైరయ్య, బద్దం రెడ్డి, మల్లేష్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.