Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 March 2025, 3:55 pm Posted by : ramakrishna

25 నుంచి తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మూడో మహాసభలు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మూడో మహాసభల జయప్రదం కోసం ప్రచార జాత కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు.  స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో గల సిపిఐ పార్టీ కార్యాలయం ఆవరణలో నిజామాబాద్ జిల్లాలో ఈనెల 25,26,27 తేదీల్లో జరుగుతున్న  తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మూడో మహాసభలను జయప్రదంలో భాగంగా జిల్లాలో రైతుల్లో, ప్రజల్లో ప్రచారం చేయడానికి , ప్రచార జాతను సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రాజిరెడ్డిలు జెండా ఊపి ప్రారంభించడం జరిగింది.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజామాబాదులో గోనే రెడ్డి ఫంక్షన్ హాల్ లో మంగళవారం రైతు సంఘం రాష్ట్ర మహాసభల ప్రారంభ సూచికంగా బహిరంగ సభ నిర్వహిస్తున్నామని ఈ బహిరంగ సభలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై, కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై మాట్లాడటానికి సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం,  తెలంగాణ రాష్ట్ర  రైతు సంఘం జాతీయ, రాష్ట్ర నాయకులు నాయకులు పాల్గొంటారని ఈ సభకు జిల్లాలోని రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిస్తున్నామన్నారు. ప్రధానంగా ఈ మహాసభల్లో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలపై చర్చ తో పాటు జిల్లాకు సంబంధించిన చెరుకు పరిశ్రమలు పసుపు, ఎర్ర జొన్న,వరి,తదితర పంటల రైతుల సమస్యలపై ప్రధానమైన చర్చ ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వై.ఓమయ్య, నాయకులు రాధాకుమార్, మహేష్, కోయేడి నర్సింలు,శ్రీరాములు గౌడ్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.