Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 March 2025, 7:26 pm Posted by : ramakrishna

తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర కమిటీ ఎన్నిక

  • రాష్ట్ర కమిటీ అధ్యక్షులుగా భాగం హేమంత రావు, ప్రధాన కార్యదర్శిగా పశ్యపద్మ

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నగరంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మూడో మహా సభల ముగింపు సందర్భంగా 109 మందితో రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షా ప్రధాన కార్యదర్శి తో పాటు 21 మంది రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ గా ఎన్నుకోబడ్డారు. రాష్ట్ర కమిటీ అధ్యక్షులుగా భాగం హేమంత రావు, ప్రధాన కార్యదర్శిగా పశ్యపద్మ లను ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా ఉజ్జిని యాదగిరిరావు, కంజర భూమయ్య, కొప్పోజు సూర్యనారాయణ, కొల్లూరు రాజయ్య, దొండపాటి రమేశ్,వి. ఎస్ ప్రసాద్ శాస్త్రి, ప్రభు లింగం, నెట్టెం నారాయణ, మిడకంటి వెంకట్ రెడ్డి, బొల్లు ప్రసాద్ ఎన్నికయ్యారు. రాష్ట్ర కార్యదర్శులుగా వర్ల వెంకటయ్య, కంబాల శ్రీనివాస్ , చంద్ర నరేంద్ర కుమార్, చిలక దేవి దాస్, దేవ భక్తుని సంద్య, కోశాధికారిగా ఎన్నికయ్యారు.