వీర జవాన్ కుటుంబ సభ్యులకు సన్మానం చేసిన తెలంగాణ రాష్ట్ర సైనిక సంక్షేమ సంచాలకులు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : వీర జవాన్ల సేవలను స్మరించుకుంటూ, వారి కుటుంబ సభ్యులను గౌరవించే కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర సైనిక సంక్షేమ శాఖ సంచాలకులు బ్రిగేడియర్ ఎన్.ఆర్. బాబు (రిటైర్డ్) పాల్గొని వీర జవాన్ కుటుంబ సభ్యులను సన్మానించారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఆదర్శ్ నగర్, దుబ్బాలోని సైనిక్ భవన్, ప్రాంతీయ సైనిక సంక్షేమ కార్యాలయంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు బ్రిగేడియర్ ఎన్.ఆర్. బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా వీర జవాన్ నీరడి గంగాప్రసాద్ భార్య నీరడి...