నేడు ‘తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ ‘ఎన్నికలు

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలు శుక్రవారం జరుగనున్నాయి. ఎన్నికల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం రాజపత్రం విడుదల చేసిన విషయం విధితమే. దానికనుగుణంగా నామిషన్ల స్వీకరణ, ఉపసంహణ పూర్తి అయి, ప్రచారఘట్టం పరిసమాప్తం ముగిసిన వేళ ఎన్నికల నిర్వహణకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, బిచ్కుంద, బాన్స్ వాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి బార్ అసోసియేషన్లు ఏర్పాట్లు పూర్తి చేశాయి. నిజామాబాద్ బార్ అసోసియేషన్ లో 441 మంది న్యాయవాదులు ఓటర్లుగా ఉన్నారు, ఆర్మూర్...