Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 December 2025, 1:11 pm Posted by : ramakrishna

అల్కహల్ వినియోగంలో తెలంగాణ ఫస్ట్

వెబ్ న్యూస్, బతుకమ్మ :  అల్కహల్ వినియోగంలో, మద్యం ఆదాయంలో తెలంగాణ మొదటి స్థానంలో  నిలిచింది.  నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ , ఎక్సైజ్ శాఖ నివేదిక ప్రకారం తెలంగాణలో ఏడాదికి సగటు తలసరి అల్కహాల్ వినియోగం 4.44 లీటర్లు గా నమోదైంది. ఈజాబితాలో తెలంగాణ తర్వాత కర్నాటక (4.25 లీటర్లు), తమిళనాడు (3.38 లీటర్లు), ఆంధ్రప్రదేశ్ (2.71 లీటర్లు), కేరళ (2.53 లీటర్లు) గా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో పట్టణ ప్రాంతాలకంటే గ్రామీణ ప్రాంతాల్లోను అల్కహల్ వినియోగం ఎక్కువగా ఉంది. అందులోను బీర్లవాడకం రికార్డు స్థాయిలో ఉంది. తెలంగాణలో ఒక్కొక్కొరు ఏడాదికి సగటున రూ.11,351 మద్యాన్ని కొనుగోలు చేసేందుకు ఖర్చు చేస్తున్నారు. ఈవిషయంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. అదే ఏపీలో ఈఖర్చు కేవలం రూ.6339గా మాత్రమే ఉంది.  మద్యం విక్రయాల ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి ఏటా రూ. 36,000 కోట్ల పైన ఆదాయం సమకూరుతందని అంచనా.