Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 October 2026, 11:40 am Posted by : ramakrishna

కోట గల్లి గర్ల్స్ గవర్నమెంట్ హైస్కూల్ నే తెలంగాణ పబ్లిక్ స్కూల్

 

. . . జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే ధన్ పాల్…

 నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేయనున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్  ఏర్పాటుకు స్థలం ఖరారు అయింది. నిజామాబాద్ నగరంలోని దశాబ్దాల చరిత్ర కలిగిన  కోట గల్లి బాలికల ఉన్నత పాఠశాలలో తెలంగాణ పబ్లిక్ స్కూల్  ఏర్పాటు కానుంది.  తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణం కొరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం తో మంజూరు చేసినట్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కలిసి గురువారం ఉదయం నగరంలోని కోటగల్లి బాలికల ప్రభుత్వ పాఠశాల పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… జిల్లాలో రెండు పబ్లిక్ స్కూల్ లను ఎంపిక చేశారన్నారు. ఇందులో భాగంగా అర్బన్ నియోజకవర్గం కు సంబంధించి నగరంలో బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎంపిక చేయడం జరిగిందన్నారు.

Telangana Public School, located within the premises of the Kota Galli Girls' High School

తాను గతంలో అనేక సార్లు పాఠశాల పరిశీలించడం జరిగింది, ఇక్కడి పరిస్థితిని చూసి పబ్లిక్ స్కూల్ కోసం ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు. సుమారు 2 వేల మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారని గుర్తుచేశారు. పబ్లిక్ స్కూల్ నిర్మాణానికి రూ.6 కోట్ల నిధులు మంజూరు చేయడం సంతోషకరమన్నారు. అయితే  నిధులు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. త్వరలోనే డీపీఆర్ సిద్ధం చేసి, టెండర్లను ఆహ్వానించడం జరుగుతుందన్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి అందుబాటులో తీసుకొచ్చేలా ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ భుజంగరావు, మేయర్ ఉమారాణి, కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్, బీజేపీ కార్పొరేటర్ ప్రసన్న శ్యామల , నాగోల్ల లక్ష్మీనారాయణ, చింతకాయల రాజేందర్, అధికారులు పాల్గొన్నారు.

Telangana Public School, located within the premises of the Kota Galli Girls' High School