Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 May 2026, 9:02 pm Posted by : ramakrishna

టీఆర్ఎస్ పార్టీలో చేరిన తెలంగాణ పోలీస్ ఉద్యోమకారుడు బోర్గి సంజీవ్

 

జుక్కల్, బతుకమ్మ :

 

పోలీస్ ఉద్యమకారుడైన బోర్గి సంజీవ్ తెలంగాణ రక్షణ సేన పార్టీ లో చేరారు. బుధవారం టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల కవిత కండువా కప్పి సంజీవ్ ని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సంజీవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో, రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో పేద ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా సరిగా నెరవేర్చలేదని అన్నారు. గత పాలకుల పాలనలో స్కీముల పేరుతో స్కాములు చేయడం జరిగిందని, ఉద్యమకారులను, కళాకారులను, అమరవీరుల కుటుంబాలను విస్మరించారని మండిపడ్డారు. తెలంగాణలో అభివృద్ధి సంక్షేమం పేరుతో దోపిడి తప్ప అభివృద్ధి సంక్షేమం జరగలేదని, తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని బోర్గి సంజీవ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కె.కవితమ్మ ఈ రాష్ట్రానికి తొలి మహిళ ముఖ్యమంత్రి కావాలని ఆయన ఆకాంక్షించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పూర్తిగా అమలయ్యే విధంగా దృష్టి సారించాలని లేని పక్షంలో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు, పోరాటాలు, నిర్వహిస్తామని తెలిపారు. జుక్కల్ నియోజకవర్గ మహిళలు, ప్రజలు, రైతులు, యువకులు, నిరుద్యోగులు, ప్రతి ఒక్కరూ టీఆర్ఎస్ పార్టీని బలపరచాలని ఆయన కోరారు. టీఆర్ఎస్ పార్టీలో సాధరంగా ఆహ్వానించి, ఆశీర్వదించిన టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకి బోర్గి సంజీవ్ కృతజ్ఞతలు తెలిపారు.