రూద్రూర్ లో ఘనంగా తెలంగాణ ప్రజాపాలన దినం
రుద్రూర్, బతుకమ్మ : తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం రుద్రూర్ మండల కేంద్రంలోని మండల సమీకృత భవన సముదాయ కార్యాలయం వద్ద, గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద తహసిల్దార్ తారాబాయి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సురేష్ బాబు, గ్రామ మాజీ సర్పంచ్ ఇందూరి చంద్రశేఖర్, పంచాయతీ సెక్రటరీ గంగాధర్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.