ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం
బతుకమ్మ, బిక్కనూరు: ఇక్కడ మండల కేంద్రంలో బిజెపి ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షులు ఉప్పరి రమేష్ మాట్లాడుతూ1947 ఆగస్టు 15న బ్రిటిష్ వారి పాలన అంతమై భారతదేశమంతటా స్వాతంత్ర్య సంబరాలు జరుపుకున్నారు. కానీ దేశం నడి బొడ్డున ఉన్న హైదరాబాద్ సంస్థాన ప్రజలకు ఆ అదృష్టం లేకుండా పోయింది. అప్పటి వరకూ బ్రిటిష్ వారికి సామంతుడిగా ఉన్న హైదరాబాద్ నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ తాను కూడా స్వతంత్రుడిని అయ్యానని ప్రకటించుకున్నాడు. హైదరాబాద్ అటు ఇండియాలో, ఇటు పాకిస్తాన్లో...