Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 September 2025, 7:13 pm Posted by : ramakrishna

ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం

బతుకమ్మ, బిక్కనూరు: ఇక్కడ మండల కేంద్రంలో బిజెపి ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షులు ఉప్పరి రమేష్  మాట్లాడుతూ1947 ఆగస్టు 15న బ్రిటిష్ వారి పాలన అంతమై భారతదేశమంతటా స్వాతంత్ర్య సంబరాలు జరుపుకున్నారు. కానీ దేశం నడి బొడ్డున ఉన్న హైదరాబాద్ సంస్థాన ప్రజలకు ఆ అదృష్టం లేకుండా పోయింది. అప్పటి వరకూ బ్రిటిష్ వారికి సామంతుడిగా ఉన్న హైదరాబాద్ నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ తాను కూడా స్వతంత్రుడిని అయ్యానని ప్రకటించుకున్నాడు. హైదరాబాద్ అటు ఇండియాలో, ఇటు పాకిస్తాన్లో కలవదని స్వతంత్రంగా ఉంటుందని ప్రకటించాడు. కానీ సంస్థానంలోని ప్రజలు తాము భారతదేశంలో కలవాలని కోరుకున్నారు. నిజాం అండతో రజాకార్లు చెలరేగిపోయారు.. ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. గ్రామాలపై పడి ప్రజలను దోచుకొని, హత్యాకాండను కొనసాగించారు. ఉస్మాన్ అలీఖాన్. భారత దేశ నడిబొడ్డున క్యాన్సర్ కణితిలా మారిన హైదరాబాద్ సంస్థానంపై చర్య తీసుకోక తప్పదని నాటి హోం మంత్రి సర్దార్ వల్లభాయి పటేల్ నిర్ణయించుకున్నారు.. ఈ పరిణామాల నేపథ్యంలో 1948 సెప్టెంబరు 13న భారత సైన్యం ఆపరేషన్ పోలో పేరిట హైదరాబాద్ సంస్థానాన్ని ముట్టడించింది. దీనికి పోలీస్ యాక్షన్ అనే పేరు పెట్టారు. ఆ తర్వాత సెప్టెంబరు 17న తెలంగాణ సంస్థానం భారతదేశంలో విలీనం అయిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి అతేల్లి  తిరుమలేష్ ,పొన్నాల రంజిత్, ఉపాధ్యక్షులు నాగర్తి నరేందర్ రెడ్డి,జిల్లా కార్యవర్గ సభ్యులు రెడ్డి గారి రమేష్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, పిట్ల రాజయ్య, శ్రీనివాస్ రెడ్డి ,రవీందర్ రెడ్డి  మండల కోశాధికారి మహేందర్ రెడ్డి  ఏక్ నాథ్,బల్ల బాల్ లింగం, గ్రామాల అధ్యక్షులు నర్సారెడ్డి, విలాస్ రెడ్డి, కుమ్మరి నరేందర్,  బిజెపి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.