మహారాష్ట్రలో తెలంగాణ నేతలు
అభ్యర్థుల గెలుపు కోసం కాంగ్రెస్, బీజేపీ నేతల ప్రచారం నిజామాబాద్, బతుకమ్మ : ఉత్తర తెలంగాణ జిల్లా నేతలకు ఎలక్షన్ ఫీవర్ పట్టుకుంది. తెలంగాణలో ప్రస్తుతానికి ఎలాంటి ఎన్నికల హడావుడి లేకపోయినప్పటికీ పొరుగున ఉన్న మహారాష్ట్రలో మొదటి విడత శాసనసభ, పార్లమెంట్ ఉప ఎన్నిక ఈ నెల 20న జరుగనుంది. దాంతో అక్కడ ప్రచారానికి తెలంగాణ నేతలు తరలివెళ్లారు. ప్రధానంగా మహారాష్ట్రకు సరిహద్దున పూర్వ తెలంగాణ జిల్లాలైనా నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ తో సుదీర్ఘ సరిహద్దు ఉంది. అందులో ప్రధానంగా నాందేడ్ జిల్లాకు నిజామాబాద్...