మోర్తాడ్, బతుకమ్మ : మోర్తాడ్ మండలంలోని సుంకేట్ గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం తెలంగాణ భాషా దినోత్సవం, టీచర్స్ డే ఘనంగా నిర్వహించారు. పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు పెద్ది సంతోష్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ భాష యాస ప్రత్యేకత సంతరించుకుందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు ఉపాధ్యాయులను పూల మాలలు వేసి, శాలువాతో సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.