పార్టీ ఆవిర్భావ సభ ఏర్పాట్లను పరిశీలించిన తెలంగాణ జాగృతి మహిళా నాయకులు

  మేడ్చల్, బతుకమ్మ :   తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈ నెల 25న కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో జాగృతి మహిళా నాయకులు సభ ఏర్పాట్లను పరిశీలించారు. తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మంచాల వరలక్ష్మీ ఆధ్వర్యంలో పలువురు మహిళా నాయకులు మేడ్చల్ జిల్లా మునీరాబాద్ లోని అద్వయ కన్వెన్షన్ సెంటర్ లో సభ ఏర్పాట్లపై నిర్వాహకులతో సమీక్షించారు. తెలంగాణ నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చే జాగృతి క్యాడర్, వాహనాల పార్కింగ్.. మహిళల కోసం ప్రత్యేక...